Kalyan Shankar: ఎన్టీఆర్ సాంగ్‌కు స్టెప్పులు ఇరగదీసిన 'మ్యాడ్' డైరెక్టర్ 5 d ago

రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో వచ్చిన 'మ్యాడ్-2' చిత్రం భారీ విజయం సాధించింది. విడుదలైన వారంలోనే దాదాపు రూ.80 కోట్లను కలెక్ట్ చేసింది. హైదరాబాదులో జరిగిన సక్సెస్ మీట్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గెస్టులుగా హాజరయ్యారు. 'ఆంధ్రావాలా' సినిమాలోని 'నాయిరే నాయిరే' పాటకు డైరెక్టర్ కల్యాణ్ శంకర్ మాస్ స్టెప్పులు వేశారు. రాంప్రసాద్‌తో కలిసి స్టేజ్ మీద డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.